హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలుడిపై దాడి.. నిందితుడి అరెస్ట్

భీమవరం రెల్లి కాలనీలో బాలుడిపై దాడి ఘటనకు సంబంధించి వర్రే కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాకలి చెరువు వద్ద బాలుడిని కొట్టి నీటిలోకి తోసిన అనంతరం ఓ గదిలో బంధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాలుడి దవడ ఎముక విరిగింది. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించింది.