హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల 'వజ్రప్రహార్' తనిఖీలు.. 23 వాహనాలు స్వాధీనం!

​కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురం వడ్డెర కాలనీలో పోలీసులు 'వజ్రప్రహార్' కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ విక్రయాలపై సమాచారం అందించాలని, వివరాలు రహస్యంగా ఉంచుతామని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఐ వీరబాబు, ఎస్సైలు పాల్గొన్నారు.