హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు పాలనపై ధర్మశ్రీ విమర్శలు

AKP: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కరవు పరిస్థితులు నెలకొంటున్నాయని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. గొలుగొండ మండలం పాకాలపాడులో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ హయాంలో సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందాయని పేర్కొన్నారు.