హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ఢీకొని మహిళ మృతి

ఏలూరు ఎంఆర్సీ కాలనీకి చెందిన నర్రాపు సరస్వతి (65) రైలు ఢీకొని శుక్రవారం మృతి చెందారు. పవర్‌పేట రైల్వే ట్రాక్ గేటు సమీపంలో బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా రైలు ఢీకొట్టినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను 108 సిబ్బంది ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.