హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తవీధి రహదారిపై చెత్త కుప్పలు

PPM: పాలకొండ పట్టణ శివారులోని కొత్తవీధి రహదారి చెత్తాచెదారంతో నిండిపోయింది. రోడ్డుపైనే ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలికి ప్లాస్టిక్ కవర్లు కళ్లలో పడటంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని కోరుతున్నారు.