SKLM: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం నుంచి పొందూరు వెళ్లే రహదారిలోని తోటల్లో జూదం ఆడుతున్న ఐదుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎచ్చెర్ల ఎస్సై జి. లక్ష్మణరావు తెలిపారు. వారి నుంచి రూ.10,490 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జూదం ఆడుతున్న ఐదుగురి అరెస్ట్


