W.G: నరసాపురం మండలం వేములదీవి కాపులకొడపలోని శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. గరుడ వాహన సేవ సందర్భంగా స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. గరుడ వాహనంపై కొలువుదీరిన స్వామివారి దివ్యరూపాన్ని దర్శించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
గరుడ వాహనంపై వెంకటేశ్వరస్వామి


