అన్నమయ్య: మొలకలచెరువు మండలం బురకాయలకోటలో షేక్ తాజుద్దీన్ (19) శనివారం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్న అతడు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బురకాయలకోటలో యువకుడి బలవన్మరణం


