SKLM: పొందూరు మండలం పెనుబర్తి సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద వర్షం నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ పారుదల సరిగా లేకపోవడంతోనే సమస్య తలెత్తుతోందని స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీరు


