హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీజే సౌండ్‌కు మహిళ మృతి

కర్నూలు మండలం ఇ.తాండ్రపాడులో వినాయక నిమజ్జనంలో ఏర్పాటు చేసిన డీజే సౌండ్‌కు శివమ్మ (36) అనే మహిళ మృతి చెందారు. శుక్రవారం రాత్రి డీజే దగ్గర ఆమె కొద్దిసేపు నృత్యం చేసి కడుపులో నొప్పి వస్తోందంటూ ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా అప్పటికే మరణించినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు.