నెల్లూరు శాంతినగర్‌లో ఓ ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. సాయిసందీప్ దంపతులు ఈ నెల 17న ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండగా, 98 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ కనిపించలేదు. వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు శాంతినగర్‌లో భారీ చోరీ


