హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురంలో పోలీసుల కార్డెన్ సెర్చ్

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని ఏకలవ్య కాలనీలో ఇవాల ఉదయాన్నే పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి, సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానస్పద వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. అసాంఘిక కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు