హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెజ్జిపురం, తామాడ పంచాయతీలు యథావిధి

SKLM: లావేరు మండలం బెజ్జిపురం, తామాడ పంచాయతీలను యథావిధిగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బొంతుపేట, పాతరౌతుపేటలను వేరు పంచాయతీలుగా చేస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించినట్లు ఎంపీడీవో వెంకటరాజు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రణస్థలం మండలంలోని కొన్ని గ్రామాలను వెంకటరావుపేట పంచాయతీలో విలీనం చేసినట్లు తెలిపారు.