హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం జింకపాలెం గ్రామంలో వినాయక ఊరేగింపు సందర్భంగా శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. డీజే సిస్టమ్‌కు విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా 19 ఏళ్ల భరత్ కుమార్‌కు షాక్ తగిలింది. వెంటనే అవనిగడ్డ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నాగాయలంక పోలీసులు కేసు నమోదు.