హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతన్నలకు ఊరటనిచ్చిన వర్షం!

నెల్లూరు: అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలోని మబ్బులన్నీ పూర్తిగా నల్లగా మారిపోయాయి. మండలంలోని నార్త్ మోపూరు, రైస్ మిల్ కాలనీ, గోగులపల్లి, మందిరం, తుఫాన్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ అకాల వర్షం రైతన్నలకు కొంత ఊరటనిచ్చింది.