ASR: జీకేవీధి మండలం రింతాడలో 516-ఈ హైవేపై జీబ్రా క్రాసింగ్ లైన్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని జాతీయ ఆదివాసీ స్వయంపాలన సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సోమేష్ కుమార్ కోరారు. గ్రామంలోని విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు హైవే దాటాల్సి వస్తోందన్నారు. రద్దీగా ఉండే రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'హైవేపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి'


