కృష్ణా: మొవ్వ మండలం కూచిపూడిలో రహదారుల పరిస్థితి దారుణంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, పాదచారులకు రాకపోకలు కష్టంగా మారాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు కూడా కాలనీలోకి చేరేందుకు ఇబ్బందులు పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రెండు దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులు మారుతున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూచిపూడిలో అధ్వానంగా రహదారులు


