హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో అభివృద్ధి పనులు శంకుస్థాపన

W.G: భీమవరం పట్టణంలో రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మరియు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. పట్టణంలోని 4, 5 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులను వారు లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తామన్నారు.