SKLM: పొందూరు మండలం బాణాం పంచాయతీ తాణేం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి గొర్లె రాము (17) పాముకాటుతో శుక్రవారం మృతిచెందాడు. కళాశాల నుంచి వచ్చిన రాము పొలంలో టమోటా నారు వేసేందుకు వెళ్లగా పాము కాటేసింది. 108 వాహనం మార్గమధ్యలో మరమ్మతుకు గురై ఆలస్యం కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబంలో విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
పాముకాటుతో ఇంటర్ విద్యార్థి మృతి


