హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి

అన్నమయ్య: సంబేపల్లె మండలంలో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రౌతుకుంట పంచాయతీ దిన్నమీద్దపల్లికి చెందిన కలందర్‌, వంగిమల్లిపల్లికి చెందిన బాబా పకృదిన్‌ రాయచోటి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పీలేరు వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.