SKLM: సీఎం విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో ఈ నెల 19న జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు తరలించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ తెలిపారు. దీంతో అన్ని రూట్లలో కొన్ని బస్ సర్వీసులు రద్దు చేసినట్లు శుక్రవారం ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణికులు అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటనతో బస్సు సర్వీసుల రద్దు


