హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పొన్నూరులో 'స్వచ్ఛతా హీ సేవ'

GNTR: స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ప్రతి నెల మూడో శనివారాన్ని స్వచ్ఛ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు తెలిపారు. శనివారం 15, 16 వార్డుల గ్యాస్ గోడౌన్ వద్ద 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.