కృష్ణా: కంకిపాడు మండలంలో డయేరియా వ్యాప్తి నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి చిక్కవరపు శ్రీహరి డిమాండ్ చేశారు. మురుగు కాలువలను తక్షణమే శుభ్రం చేయాలని కోరారు. కాలువల్లో ఉన్న మంచినీటి పైపులను వెంటనే తొలగించి, వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నేతలు చంటిబాబు, రెడ్డయ్య, నాగరాజు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ సీపీఎం ఆందోళన


