SKLM: బూర్జ మండలం డొంకలపర్త గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని ఎస్సై ప్రవల్లిక శుక్రవారం రాత్రి నిర్వహించారు. గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. గ్రామాల్లో చిన్నచిన్న వివాదాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకముందే పరిష్కరించుకోవడానికి ‘పల్లె నిద్ర’ కార్యక్రమం దోహదపడుతుందని ఎస్‌ఐ తెలిపారు. స్థానికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వివాదాల పరిష్కారానికి ‘పల్లె నిద్ర’: ఎస్సై


