KDP: ఒంటిమిట్ట మండలం రాచగుడిపల్లె మలుపు సమీపంలోని రామయ్యగారి సత్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారని ఇబ్రహీంపేటకు చెందిన రఘురాం రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెంచలకోనకు వెళ్లే భక్తుల విశ్రాంతి కోసం తమ పూర్వీకులు సత్రాన్ని నిర్మించారని తెలిపారు. పురాతన కట్టడాన్ని కుట్రపూరితంగా నేలమట్టం చేశారని ఆరోపిస్తూ, ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాచీన సత్రం కూల్చివేతపై పోలీసులకు ఫిర్యాదు


