AKP: మండల సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఆశాజ్యోతి తెలిపారు. ఉదయం 10:30 గంటలకు స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీటీసీలకు ఆహ్వానాలు పంపించారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మండల సమావేశానికి ఎంపీటీసీలకు ఆహ్వానం


