PPM: సీతంపేట మండలం కోడిస పంచాయతీ ఎర్రన్నగూడ గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థి అర్పిత్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ శుక్రవారం విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సహాయంపై అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కుటుంబానికి అండగా ఉంటానన్న ఎమ్మెల్యే


