హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'న్యాయం గెలిచింది'

KDP: బద్వేలులో 2024లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసులో నిందితుడు జక్కుల విగ్నేష్ అలియాస్ సాయి (22)కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. తీర్పు అనంతరం బాలిక తల్లి భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం నాలుగోడ్ల సెంటర్‌లో కొవ్వొత్తి వెలిగించి, తన బిడ్డకు జరిగిన అన్యాయం మరే తల్లికి జరగకూడదని ఆకాంక్షించారు. తనకు అండగా నిలిచిన ప్రజలు, పోలీసులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.