కడప జిల్లా కలసపాడు మండలం ఎగువ రామపురం సమీపంలో శుక్రవారం రాత్రి ఆటో ప్రమాదానికి గురైంది. ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఆటో బోల్తా.. పలువురికి గాయాలు


