హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాలివానకు 52 ఎకరాల్లో అరటి పంట నష్టం

ATP: ఆత్మకూరు మండలం సనప గ్రామంలో వీచిన తీవ్రమైన గాలివానకు 52 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా నేలకొరిగింది. మూడు, ఆరు నెలల వయసున్న పంట కిందపడిపోవడంతో తీరని నష్టం వాటిల్లింది. ఉద్యానశాఖ అధికారిణి దివ్య దెబ్బతిన్న తోటలను పరిశీలించారు. ఎకరాకు రూ. లక్ష వరకు పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని దెబ్బతిన్న రైతులు వాపోయారు.