KDP: బద్వేలులోని రాచపూడి నాగభూషణం డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 22న ఉదయం 9 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, నైపుణ్య అధికారి సురేష్‌కుమార్ తెలిపారు. 16కు పైగా ప్రైవేటు సంస్థలు మేళాలో పాల్గొంటాయని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత ఉన్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 63001 25455ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బద్వేలులో జాబ్ మేళా'


