హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి

సత్యసాయి: జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో రైతులు, కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, పశుపోషకులను ప్రభుత్వం ఆదుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందించాలని, ప్రత్యామ్నాయ పంటలకు ఉచిత విత్తనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.