హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో వైసీపీదే గెలుపు: జక్కంపూడి

తూ.గో: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులంతా విజయం సాధించేలా కేడర్ అంతా సమిష్టి కృషితో పని చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. సీతానగరం మండలం రాజంపేటలో గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశం అయ్యారు.