హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీరు లేని చెరువుల్లో వినాయక నిమజ్జనం

అనంతపురం: జిల్లాలో కరువు పరిస్థితులు వినాయక నిమజ్జన వేడుకల్లో కనిపించాయి. ఎల్లనూరు, పుట్లూరు ప్రాంతాల్లో నీరు లేక వెలవెలబోయిన చెరువులు, నదుల్లోనే భక్తులు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. నీరు లేకపోవడంతో బొజ్జ గణపయ్యను ఇలా నిమజ్జనం చేయాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయని రైతులు తెలిపారు.