కోనసీమ: లక్కవరం ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి బొలుసులమ్మ ఆలయం మీదుగా విశ్వేశ్వరాయపురం వెళ్లే రోడ్డును అభివృద్ధి చేయాలని కోరుతూ స్థానికులు శుక్రవారం ధర్నా చేశారు. ఎంతో కాలం నుంచి రోడ్డు అధ్వాన్నంగా ఉన్నా దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణం స్పందించి ఈ రహదారిని అభివృద్ధి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు అభివృద్ధి కోరుతూ గ్రామస్తులు నిరసన


