ASR: వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని కోరుతూ పాడేరు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు అక్టోబర్ 2 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు సీఐటీయూ నేత సుందరరావు తెలిపారు. కార్మికులకు రూ.21 వేల వేతనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రతి నెల 5వ తేదీలోగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 2 నుంచి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె


