హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖకు గ్రీన్ మెట్రో ఏసీ బస్సులు

VSP: రాష్ట్రంలో తొలిసారిగా గ్రీన్ మెట్రో ఏసీ బస్సులు విశాఖ జిల్లాకు చేరనున్నాయి. ఈ నెలాఖరులోగా గాజువాక డిపోకు 30 బస్సులు, అక్టోబర్ నెలాఖరులోగా సింహపురి డిపోకు మరో 50 బస్సులు అందనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. రిజిస్ట్రేషన్, అనుమతుల ప్రక్రియ పూర్తయ్యాక బస్సులను వివిధ రూట్లలో నడపనున్నట్లు పేర్కొన్నారు.