హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

26 నుంచి కబడ్డీ పోటీలు ప్రారంభం

VSP: పరవాడ మండలం సాలాపువానిపాలెం గ్రామంలో వినాయక ఉత్సవాల సందర్భంగా ఈనెల 26 నుంచి 28 వరకు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ఛైర్మన్ సాలాపు మోహన్రావు తెలిపారు. పురుషుల విభాగంలో రూ.40 వేలు, మహిళల విభాగంలో రూ.30 వేల వరకు బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొనాలని కోరారు.