KDP: ప్రొద్దుటూరు పాత బస్టాండ్‌లో రద్దీగా ఉన్న బస్సు ఎక్కే సమయంలో హ్యాండ్ బ్యాగ్ చోరీ చేసిన ముగ్గురిని మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.షేక్ కరిముల్లా పటాన్, ముబీన పటాన్, సాహిత్ ఖాన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చోరీ చేసిన బ్యాగులో సుమారు 5 తులాల బరువున్న 4 బంగారు గాజులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందనన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బస్టాండ్‌లో హ్యాండ్ బ్యాగ్ చోరీ'


