VSP: అడివివరం గ్రామ పంచగ్రామాల భూములు, జిరాయితీ, గ్రామకంఠం భూ సమస్యలపై ఆదివారం గ్రామసభ నిర్వహిస్తున్నట్లు మాజీ సర్పంచి పాశర్ల ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటలకు రాజవీధిలోని రామాలయం వద్ద సభ జరుగుతుందన్నారు. భూ సమస్యలతో బాధపడుతున్న వారు హాజరై తమ సమస్యలను తెలియజేయాలని కోరారు. పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభ


