KDP: ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు శుక్రవారం రామేశ్వరం సాయిబాబా ఆలయం వెనుక జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 22,870 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. సీఐ కొండారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి సిబ్బందితో దాడి చేసి రమేష్, మజీద్, రవీంద్రరెడ్డి, ఉపేంద్ర, ప్రతాప్, మదార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రామేశ్వరం వద్ద జూదం'


