సిద్దిపేటకు రావడానికి బుల్లెట్‌ప్రూఫ్ బస్సులు, 3 వేల మంది పోలీసుల పహారా ఎందుకని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల పర్యటనపై స్పందిస్తూ... భయపడాల్సిన పనిలేదని, తన ఇంటికి వస్తే కడుపునిండా భోజనం పెట్టి దగ్గరుండి తన తోటంతా చూపిస్తానని అన్నారు. అనవసర భద్రతతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ
'నా ఇంటికి వస్తే కడుపునిండా అన్నం పెడతా'


