హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాల వ్యాపారి దారుణ హత్య

RR: వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం పాల వ్యాపారి భుజంగరావు(60) దారుణ హత్యకు గురయ్యారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దుండగులు వెంబడించి కత్తితో మెడపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. భూ వివాదమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.