హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరువు మండలంగా ప్రకటించాలి: AIKMS

KMM: టేకులపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట మండల నాయకులు భూక్య నర్సింగ్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ప్రభుత్వం వెంటనే కరువు ప్రకటించి రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు.