హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పనులు ప్రారంభించాలి'

WGL: వర్ధన్నపేట నియోజకవర్గానికి మంజూరైన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. రూ.200కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌ ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు.