హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీఓ 97ను రద్దు చేయాలని విద్యార్థినుల ఆందోళన

MDK: పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని, జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థినులు కళాశాల గేటు వద్ద ధర్నా చేశారు. స్కిల్ యూనివర్సిటీ విధానాలతో డిప్లొమాను ఐటీఐలతో ముడిపెడితే భవిష్యత్తు దెబ్బతింటుందని మండిపడ్డారు. విద్యార్థినుల ఆందోళనతో నేటి పరీక్షలను అధికారులు వాయిదా వేశారు.