GDWL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా సీటీ స్కాన్, ల్యాబ్‌లను పరిశీలించారు. రోగుల రద్దీ నివారణకు టోకెన్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని, ఖాళీగా ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ భవనాలకు మరమ్మతులు చేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'ఆసుపత్రి అభివృద్ధి పనులను వేగవంతం చేయండి'


