హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జర్నలిస్టు కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ'

MHBD: తొర్రూరు మంలోని గుర్తూరు గ్రామానికి చెందిన జర్నలిస్టు పెందోట కిషన్ తండ్రి పెందోట లింగాచారి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మడిపల్లి మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి రూ.3000 నగదు, 25 కేజీల బియ్యం అందజేశారు.