హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు'

ASF: గంజాయి సాగు చట్టవిరుద్ధమని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని సాగు చేయవద్దని ఏఈవో వినోద్ స్పష్టం చేశారు. రెబ్బెన మండలం సోనాపూర్ గ్రామంలో శుక్రవారం రైతులతో సమావేశమయ్యారు. ఇటీవల జైనూర్‌లో పత్తి చేన్లలో గంజాయి మొక్కలు సాగు చేసిన ఘటనలను గుర్తుచేస్తూ గంజాయి సాగు చేస్తే రైతు భరోసాతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని హెచ్చరించారు.