GDWL: పాలిటెక్నిక్ విద్యను శక్తి పాలసీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గద్వాల మండలం గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు శుక్రవారం రెండో రోజు నిరసన చేపట్టారు. శక్తి పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. విలీన ప్రతిపాదనలను నిలిపివేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
శక్తి పాలసీపై విద్యార్థుల ధర్నా


